ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Fake Challans: నకిలీ చలాన్ల వ్యవహారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం - నకిలీ చలాన్ల తాజా వార్తలు

నకిలీ చలాన్ల వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
నకిలీ చలాన్ల వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

By

Published : Sep 7, 2021, 3:02 PM IST

Updated : Sep 7, 2021, 3:51 PM IST

14:58 September 07

నకిలీ చలాన్ల వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

నకిలీ చలాన్ల (Fake Challans) వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రికవరీ కాని ఆస్తులు స్టాంప్ డ్యూటీ (Stamp Duty) కట్టని జాబితాలోకి చేరుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ధ్రువపత్రాల్లో స్టాంప్‌డ్యూటీలో బకాయి ఉన్నట్లు పేర్కొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.ఆరున్నర కోట్లు రికవరీ (Recovery) చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 

రాష్ట్ర ఖజానాకు గండి

రాష్ట్రంలో నకిలీ చలానాల కుంభకోణం కలకలం రేపుతోంది. కడప సబ్ రిజిస్ట్రార్ (Sub-Registrar) కార్యాలయంలో వెలుగుచూసిన ఈ కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో 2018 నుంచి ఆన్​లైన్ (Online) ద్వారా అప్​లోడ్ (Upload) చేసిన చలాన్లపై అధికారులు పరిశీలించి..దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. 2021 జనవరి నుంచి నకిలీ చలానాలతో మోసం జరిగినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి దాదాపు ఎనిమిది మంది పూర్తిస్థాయిలో స్టాంప్ డ్యూటీ కట్టినట్లు చలాన్లు సమర్పించినా..ప్రభుత్వ ఖజానాకు జమ కాలేదు. దీంతో నకిలీ చలాన్ల ద్వారా మోసం జరిగినట్లు అధికారులు తేల్చారు. మరికొన్ని డాక్యుమెంట్లలో చలానాల రూపంలో స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు చూపించినా..సీఎంఎఫ్ఎస్​లో మాత్రం ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. ఫలితంగా స్టాంప్ డ్యూటీ చెల్లించని వారికి అధికారులు నోటీసులు (Notice) జారీ చేశారు.

లోపాన్ని అవకాశంగా మార్చుకొని..

ప్రజల వెసులుబాటు కోసం ప్రభుత్వం తీసుకువచ్చినసీఎంఎఫ్ఎస్ విధానం (CMFS) అక్రమార్కులకు అందివచ్చిన అవకాశంగా మారింది. ఈ విధానంలో కంప్యూటర్‌ ద్వారా వచ్చే చలానాలపై అధికారుల ధ్రువీకరణ సంతకాలు, సీళ్లు ఉండవు. నకిలీ చలానాలు సృష్టించడానికి ఇది మొదటి లోపంగా మారింది. చలానా కట్టిన అనంతరం రిజిస్ట్రేషన్‌ చెల్లింపు మొత్తాన్ని ఎడిట్‌ (Edit) చేసుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని (Digitalization) అక్రమార్కులు వాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆప్షన్‌తో అసలు చలనాలోని మొత్తాన్ని మార్చి తమకు కావాల్సిన మొత్తాన్ని వేసుకునే అవకాశం ఉన్నట్లు కొందరు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. తమకు కావాల్సినట్లు మార్పులు చేసుకున్న చలానాను దస్తావేజులకు జత చేసి రిజిస్ట్రేషన్‌కు పంపిస్తున్నారు. దస్తావేజులను సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌ చెక్‌ లిస్టు ప్రకారం స్టాంపులు కొన్న తేదీ, దస్తావేజు రాసిన తేదీ, కొన్నవారు, అమ్మినవారు, ఆస్తి సర్వే సంఖ్య, షెడ్యూల్, హద్దులు, విస్తీర్ణం, మార్కెట్‌ విలువ, పూర్వ దస్తావేజులను పరిశీలిస్తారు. ఇవన్నీ సక్రమంగా ఉంటే చలానా పత్రంలోకి వెళతారు.

దస్తావేజు సంఖ్య ఆధారంగా..

కంప్యూటర్​లో చలానాలకు సంబంధిన అంశాలను పరిశీలించేటప్పుడు మొదట దస్తావేజు (Document) సంఖ్యను నమోదు చేస్తారు. వెంటనే నిర్దేశించిన కాలమ్స్‌లో కొనుగోలుదారుల వివరాలు కనిపిస్తాయి. ఈ దశ దాటిన తరువాత చలానా సంఖ్యను నిర్దేశిత గడిలో నింపుతారు. ఈ సంఖ్య సరైనదైతే మలి దశలోకి వెళ్లగలుగుతారు. చలానా సంఖ్య తప్పు వేసినా, అప్పటికే వినియోగించినదైనా తర్వాత దశకు వెళ్లలేరు. చలానా సంఖ్య సరిపోతే ఆ దస్తావేజుకు చెల్లించాల్సిన రుసుములు తెరపై కనిపిస్తాయి. దానికి సరిపడా మొత్తం చలానాలో ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తారు. చలానాలో సరిపడిన మొత్తం ఉండి, దాని స్టేటస్‌ సక్సెస్‌ అని కనిపిస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేస్తారు. ఆ చలానాలో పొందుపరిచిన మొత్తం సంబంధిత ఖాతాల్లో జమైందా? లేదా? అన్న అంశాన్ని శాఖలోని ఏ కార్యాలయంలోనూ పరిశీలిస్తున్న దాఖలాల్లేవు. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది.

చలానా ద్వారా సంబంధిత మొత్తాలను పొంది సర్వీసు అందించే శాఖలు జమా లెక్కలను ఎందుకు సరిచూసుకోవడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. చలానా నెంబరు (Challan Number) చూసుకుని సేవ ఎలా అందిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంత మొత్తం జమ అయిందో చూసుకోవాల్సిన బాధ్యత సర్వీసు ప్రొవైడర్‌దే (Service Provider) కదా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆ సమాచారం అందుబాటులో లేకపోతే దాన్ని అందుబాటులోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులది కాదా..అని అడుగుతున్నారు. గతంలో ఇసుక రవాణా (Sand Transport) సమయంలో ఒకే చలానా చూపించి అనేక ట్రిప్పులు రవాణా చేసే ఉదంతాలను ప్రస్తావిస్తున్నారు. 

సంబంధిత కథనాలు

FAKE CHALLAN : నకిలీ చలానాల కుంభకోణం... విస్తుపోయే నిజాలు

Fake challans: సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల బాగోతం.. రూ.36 లక్షలకుపైగా అవినీతి

FAKE CHALLANS: ఆ విధానాన్ని ఎందుకు వదిలేశారు?

Last Updated : Sep 7, 2021, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details