IAS Officers: ఐఏఎస్ అధికారుల పోస్టుల్లో మార్పులు.. ప్రభుత్వ ఉత్తర్వులు - ఐఏఎస్ అధికారుల పోస్టుల్లో మార్పులు
![IAS Officers: ఐఏఎస్ అధికారుల పోస్టుల్లో మార్పులు.. ప్రభుత్వ ఉత్తర్వులు IAS Officers posts changed in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15226046-1046-15226046-1651989467544.jpg)
10:42 May 08
సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి
IAS Officers: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల పోస్టుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. తితిదే ఈవోగా ఆయనను రిలీవ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తితిదే ఏఈవో ధర్మారెడ్డికి ఈవోగా వూర్తి బాధ్యతలు అప్పగించింది. మరికొందరు ఐఏఎస్‌ల బాధ్యతల్లోనూ మార్పులు చేర్పులు చేసింది.
నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా సత్యనారాయణ, యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా శారదా దేవిని నియమించారు. మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా సెర్ప్ సీఈవో ఇంతియాజ్‌ను నియమిస్తూ.. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఇదీ చదవండి: