పౌర సరఫరాలో చౌక దుకాణాలకు సరకు రవాణా చేసే హమాలీలకు కూలీ రేట్లను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ క్వింటాలుకూ రూ. 19 నుంచి 22 పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హామాలీ ధరలను సవరిస్తున్నామని... కొత్త ఛార్జీలు 2020 జనవరి 1 తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇందులో కొంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని.. మిగిలిన మొత్తం ఆహార సబ్సీడీ కేటాయింపుల నుంచి భరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
హామాలీ ఛార్జీలను 30 నుంచి 40 శాతం మేర పెంచాల్సిందిగా ఇప్పటికే వివిధ ట్రేడ్ యూనియన్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయని.. వీటని పరిగణనలోకి తీసుకుని అనంతరం ఈ ధరల్ని సవరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుత హామాలీ రేట్ల పెంపుతో ప్రభుత్వానికి ఏడాదికి రూ. 9.09 కోట్ల మేర అదనంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఏటా 30 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల సరకును రవాణా చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.