ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎందుకు రాలేదంటే..!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఆలస్యానికి నిధుల కొరత కారణం కాదని ఆర్థికశాఖ వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ-ముద్రలో సర్టిఫికెట్లు పని చేయకపోవడమేనని తెలిపింది.

By

Published : Aug 2, 2019, 10:09 AM IST

Updated : Aug 2, 2019, 11:20 AM IST

జీతాల ఆలస్యం పై స్పందించిన ఆర్థిక శాఖ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంపై ఆర్థికశాఖ స్పందించింది. ఒకటో తేదీన చెల్లించకపోవడానికి నిధుల కొరత కారణం కాదని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. సాధారణంగా ప్రతి నెల 1న ఆర్బీఐ ఈ-కుబేర్ ద్వారా చెల్లింపులు జరుగుతాయని... పింఛన్లు, జీతాల దస్త్రాలు యథాప్రకారం జులై 31నే ఆర్బీఐకి పంపించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ నెల 1న మధ్యాహ్నానికి పింఛన్లు పూర్తిగా, కొన్ని జీతాల దస్త్రాల చెల్లింపు జరిగాయని వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ-ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పని చేయకపోవడంతో... మిగిలిన ఫైళ్ల చెల్లింపు ఆలస్యమైందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. సమస్యను వెంటనే పరిష్కరించి మిగిలిన జీతాల చెల్లింపునకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

Last Updated : Aug 2, 2019, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details