ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్వర్ణ ప్యాలెస్‌ మృతుల కుటుంబీకులకు పరిహారం అందజేత - స్వర్ణప్యాలెస్ బాధితులపై వార్తలు

స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పరిహారం అందించింది. మంత్రులు ఆళ్ల నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు.. బాధిత కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున చెక్‌ను అందజేశారు.

news on swarna palce victims
స్వర్ణప్యాలెస్‌ మృతుల కుటుంబసభ్యులకు పరిహారం అందజేత

By

Published : Aug 25, 2020, 2:07 PM IST

Updated : Aug 25, 2020, 2:56 PM IST

స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాద ఘటనలో మృతి చెందిన బాధితుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ. 50 లక్షల చొప్పున చెక్‌ను అందజేసింది. మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈ చెక్కులను.. విజయవాడ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆరుగురు బాధితుల కుటుంబసభ్యులకు అందజేశారు.

మచిలీపట్నంలో మరో ముగ్గురికీ ఈ సహాయాన్ని అందిస్తామన్నారు. కందుకూరుకు చెందిన ఓ మహిళకు నేరుగా ఇంటికి చెక్కు‌ పంపిస్తామని చెప్పారు. నిబంధనలు పాటించని కొవిడ్‌ కేంద్రాలపై చర్యలు తప్పవని మంత్రులు హెచ్చరించారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టులో ఉందని.. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

స్వర్ణప్యాలెస్‌ మృతుల కుటుంబసభ్యులకు పరిహారం అందజేత
Last Updated : Aug 25, 2020, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details