ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sagaramala Scheme: సాగరమాల పథకం కింద 12 ప్రాజెక్టుల పనులు చేపట్టిన కేంద్రం - ap latest news

sagaramala scheme: సాగరమాల పథకం కింద.. ఏపీ ప్రభుత్వం, విశాఖపట్నం పోర్టు ట్రస్టు సంయుక్తంగా.. ప్రతిపాదించిన 12 ప్రాజెక్టుల పనులను చేపట్టినట్లు.. కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ రాజ్యసభకు తెలిపింది. సాగరమాల పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.412 కోట్ల కేటాయించినట్లు వెల్లడించింది.

sagaramala scheme
సాగరమాల పథకం కింద 12 ప్రాజెక్ట్‌ల పనులను చేపట్టిన కేంద్రం

By

Published : Mar 30, 2022, 9:00 AM IST

sagaramala scheme: సాగరమాల పథకం కింద.. ఏపీ ప్రభుత్వం, విశాఖపట్నం పోర్టు ట్రస్టు సంయుక్తంగా.. ప్రతిపాదించిన 12 ప్రాజెక్టుల పనులను చేపట్టినట్లు.. కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ రాజ్యసభకు తెలిపింది. సాగరమాల పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.412 కోట్ల కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ నిధులను సాగరమాల ప్రాజెక్ట్ లు చేపట్టే మేజర్ పోర్టులు, నాన్ -మేజర్ పోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర మారిటైమ్ బోర్డులు ఇతర ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక సాయం కింద కేటాయిస్తామని మంత్రి శర్బానంద్ సోనోవాల్ వెల్లడించారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

ప్రాజెక్ట్ పురోగతిని బట్టి మూడు విడతల్లో నిధుల విడుదల చేస్తామని చెప్పారు. ఏపీలో సాగరమాల పథకం కింద చేపట్టిన ప్రాజెక్టులలో ఇప్పటివరకు 5 ప్రాజెక్టులు పూర్తయ్యాయన్న మంత్రి.. విజయవాడ భవానీ ద్వీపంలో పాసింజర్ జెట్టీ నిర్మాణ పనులు, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు, కోస్తా జిల్లాల స్కిల్ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్ రెండో దశ పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్​లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, కాకినాడలో ప్రస్తుతం ఉన్న జెట్టీని మెరుగుపరచి సీ ప్లేన్ జెట్టీ అభివృద్ధి చేయడం, భీమునిపట్నంలో పాసింజర్ జెట్టీ నిర్మాణం, కళింగపట్నంలో పాసింజర్ జెట్టీ నిర్మాణం పనులను ఆయా నిర్మాణ సంస్థలకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ పనులు వచ్చే రెండేళ్లలో పూర్తవుతాయని మంత్రి చెప్పారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details