సాగు చట్టాలను రద్దు చేయాలని దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది. మద్యాహ్నం వరకు ఆర్టీసు బస్సులు తిప్పవద్దని ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వంతో పాటు మావోయిస్టులు, భాజపా మినహా అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, అమరావతి రైతులు బంద్కు మద్దతు ప్రకటించారు.
అమరావతి జేఏసీ మద్దతు
దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్కు అమరావతి ఉద్యోగ జేఏసీ మద్దతు పలుకుతోందని ఆ సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు వ్యవసాయం చేస్తేనే ప్రజలకు ఆహారం లభిస్తుందని, వారికి ఇబ్బంది కలిగేలా చట్టాలు చేయడాన్ని సమర్థించలేమన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలు తగవన్నారు.
జయప్రదం చేయాలి: ఐలు