FINANCE MINISTER ON TDP ALLEGATIONS: రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి 48వేల కోట్లు వెళ్లాయంటూ యనమల సహా.. తెదేపా నేతలు చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. తమపై అక్కసుతోనే, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. యనమల చెబుతున్న 48వేల కోట్లు వాస్తవిక వ్యయం కాదని, ఆ మొత్తం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జరిగిన ‘బుక్ అడ్జస్ట్‌మెంట్ ట్రాన్సాక్షన్’ అనే విషయం గ్రహించాలన్నారు.
సీఎఫ్‌ఎంఎస్‌లో స్పెషల్ బిల్లులంటూ ఏమీ ఉండవని తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో అస్తవ్యస్తంగా, తప్పుల తడకగా రూపొందించిన సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ ఈ గందరగోళానికంతటికీ కారణమైందన్నారు. ఈ వ్యవస్థలో బిల్లుల చెల్లింపులకు బీఎల్‌ఎం మాడ్యూల్‌ను పొందు పర్చారని.. ట్రెజరీ కోడ్ ప్రకారమే ఈ బిల్లుల చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేశారని అన్నారు. అసలు ఈ వ్యవస్థలో స్పెషల్ బిల్లుల హెడ్ లేనే లేదని, సీఎఫ్‌ఎంఎస్ రిపోర్టింగ్ విధానంలో ‘బుక్ అడ్జస్ట్‌మెంట్ ట్రాన్సాక్షన్స్’ను గుర్తించడం కోసం స్పెషల్ బిల్లులు అనే పే్రును పెట్టడం జరిగిందని, అంతే తప్ప స్పెషల్ బిల్లుల హెడ్ అనేది లేనే లేదన్నారు. సీఎఫ్‌ఎంఎస్ క్రమపద్ధతిలో వ్యవస్థీకృతం చేయలేదని, అందుకే బుక్ అడ్జస్ట్‌మెంట్ ట్రాన్సాక్షన్లు స్పెషల్ బిల్లుల కింద చూపారన్నారు. ట్రెజరీ అధికారులకు సీఎఫ్‌ఎంస్‌లో బుక్ అడ్జస్ట్‌మెంట్ ట్రాన్సాక్షన్స్ చేసే వెసులుబాటు ప్రస్తుతం లేనందు వల్ల.. ఈ అధికారాన్ని సీఎఫ్‌ఎంస్ సీఈఓకు ఆర్థిక శాఖ అధికారులు దత్తం చేశారని తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం ఆర్థిక శాఖ, ట్రెజరీ నిబంధనల మేరకే జరిగిందన్నారు.
సీఎఫ్ఎంఎస్ స్పెషల్ బిల్స్ అనే హెడ్ లేదని ఏజీకి క్లారిఫికేషన్ ఇచ్చామన్నారు. ఆర్థిక సంవత్సరం చివరిలో ఇలాంటి బుక్ అడ్జస్ట్‌మెంట్ ట్రాన్సాక్షన్ అనేది సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ ఏర్పడక ముందు ట్రెజరీ అధికారులే మ్యాన్యువల్‌గా చేసేవారని, ఈ వ్యవస్థ ఏర్పడిన తరువాత స్వయంగా సీఎఫ్‌ఎంఎస్ సీఈవోకు ఈ అధికారం కట్టబెట్టారని, ఆ ప్రకారమే సీఈవో చేశారన్నారు. ఈ విషయంపై కూడా లిఖిత పూర్వకంగా తానే అధికారం కట్టబెట్టానని ఆర్థిక శాఖ కార్యదర్శి కాగ్‌కు తెలిపారన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి నగదు లావాదేవీలూ జరగలేదని, నగదు లావాదేవీలు లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని బుగ్గన ప్రశ్నించారు.
FINANCE MINISTER BUGGANA ON CFMS: 48వేల కోట్ల వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ఐటీని వినియోగించడంపై ఎలాంటి అనుమానాలూ లేవని, కానీ సీఎఫ్‌ఎంస్ సాఫ్ట్‌వేర్‌ను ఒక ప్రణాళికా బద్ధంగా చేయకుండా.. అసంపూర్తిగా గత ప్రభుత్వం వదలి వేసిందన్నారు. ఆ లోపాలను తమ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సవరించుకుంటూ వస్తుందని వివరించారు. తద్వారా సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆర్బీఐ నిబంధనల మేరకే ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్ని తీసుకున్నట్లు బుగ్గన స్పష్టం చేశారు. వేస్ అండ్ మీన్స్ అనేది తాత్కాలిక అప్పు మాత్రమేనని, ఈ తాత్కాలిక అప్పును అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ ప్రశ్నించగా.. ఆర్థిక శాఖ కార్యదర్శి ఇందుకు సంబంధించి కాగ్‌కు వివరంగా లేఖ రాశారని బుగ్గన తెలిపారు.
ఇదీ చదవండి :వారి మరణాలకు.. కొడాలి నానికి.. సంబంధం ఏంటి ? - వర్ల