ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''విద్యార్థుల సృజనాత్మకతకు విజ్ఞాన ప్రదర్శనలు దోహదం'' - సైన్స్ ఎక్స్ పో 2019

విజయవాడ కేబీఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్ పో-2019ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందిస్తాయని అన్నారు.

విద్యార్థుల సృజనాత్మకతకు విజ్ఞాన ప్రదర్శనలు దోహదం : వెల్లంపల్లి

By

Published : Aug 21, 2019, 11:43 PM IST

విద్యార్థుల సృజనాత్మకతకు విజ్ఞాన ప్రదర్శనలు దోహదం : వెల్లంపల్లి

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు విజ్ఞాన ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. విజయవాడ కాకరపర్తి భావనారాయణ (కేబీఎన్) కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల సైన్స్ ఎక్స్​పో-2019ను మంత్రి ప్రారంభించారు. ఎలక్ట్రానిక్స్, భౌతిక, రసాయన, జంతు, వృక్ష శాస్త్ర విభాగాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను తిలకించారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే అనేక ప్రాజెక్టులను రూపొందించారని అభినందించారు.

పాఠశాల విద్యార్థులు ఇటువంటి ప్రదర్శనలను తిలకిస్తే.. పరిశోధనల పట్ల వారికీ ఆసక్తి పెరుగుతుందని కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ వి.నారాయణరావు అభిప్రాయపడ్డారు. విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పాఠశాలల యాజమాన్యాలు సైతం ఈ ప్రదర్శనకు తమ విద్యార్థులను తీసుకురావాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details