జూన్ 9లోపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించినట్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను వాణిజ్యశాఖ ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా జూన్ 9న నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహాసభలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్లు చెప్పారు. వాణిజ్యపన్నుల శాఖలో జీఎస్టీ ఆఫీసర్‌కు గెజిటెడ్ హోదా ఇవ్వడంపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
"జూన్ 9లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశాలు" - cm jagan news
Employees Union Meet CM Jagan: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను వాణిజ్యశాఖ ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. జూన్ 9లోగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అధికారులను జగన్ ఆదేశించినట్లు ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు.
సీఎం జగన్‌ను కలిసిన ఉద్యోగుల సంఘాల నేత
బుధవారం 5గంటలకు సీఎస్ నేతృత్వంలో సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కానున్నట్లు సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రేపటి సమావేశంలో సీఎస్ చర్చిస్తారని తెలిపారు. అయితే.. ఇవాళ సాయంత్రంలోగా పీఆర్సీ పెండింగ్ జీవోలు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి:ఆయనకు ఇన్ని పదవులు కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? : జనసేన