మాజీ ఎన్నికల కమిషనర్ కనగరాజ్ నివాసం ఇంటి అద్దె చెల్లింపుపై వివాదం చెలరేగింది. కనగరాజ్ నివాసంలో ఫర్నీచర్‌ను వెనక్కి తీసుకురావాలని ప్రస్తుత ఎస్ఈసీ ఆదేశించగా.. విజయవాడలోని బెంజిసర్కిల్ ల్యాండ్ మార్క్ ప్రైడ్ నివాసానికి సిబ్బంది వెళ్లారు.
ఫర్నీచర్ వెనక్కి తీసుకువెళ్లే యత్నంపై అపార్టుమెంట్ యజమాని అభ్యంతరం తెలిపారు. 6 నెలల అద్దె బకాయిలు చెల్లించి తీసుకెళ్లాలని తేల్చి చెప్పారు. ఈ విషయంపై... ఎస్‌ఈసీ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.