ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధ్యాయుల బదిలీల్లో మార్పులు.. కొత్త షెడ్యూల్‌ విడుదల - a new schedule for teacher transfers

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన సవరణ ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.

new schedule for teacher transfers
ఉపాధ్యాయుల బదిలీల్లో మార్పు చేస్తూ కొత్త షెడ్యూల్‌ విడుదల

By

Published : Jan 9, 2021, 7:00 AM IST

ఉపాధ్యాయుల బదిలీల్లో మార్పు చేస్తూ పాఠశాల విద్యా శాఖ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రధానోపాధ్యాయుల సర్వీసు ఐదేళ్లు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాలని ప్రభుత్వం జారీ చేసిన సవరణ ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టేసింది. మరోవైపు... పదోన్నతులు, ఉన్నతీకరణ పోస్టులను ఖాళీలుగా చూపాలని మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంపై.. ఉపాధ్యాయులకు అనుకూలంగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో.. బదిలీల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి ఈ నెల 11 వరకు ఖాళీల ప్రదర్శన, తెలుగు, హిందీ స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయుల వెబ్ ఆప్షన్లు నమోదుకు 12 నుంచి 16 వరకు అవకాశం కల్పించారు. తుది సీనియారిటీ జాబితాను 17-18 మధ్య విడుదల చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details