ఏపీ ఎడ్సెట్ ఫలితాలువిడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఛైర్మన్ విజయరాజు విజయవాడలో పలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్షకు 14,019 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,650 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం98.02 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు98.56 శాతం,బాలికలు97.76శాతం ఉన్నారు.ఈనెల 6న 16 పట్టణాల్లోని 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈసారి ఎడ్సెట్ నిర్వహణ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం చేపట్టింది.
ఏపీ ఎడ్సెట్- 2019 ఫలితాలు విడుదల - results
ఏపీలోని బీఈడీ కళాశాలల్లో ఉపాధ్యాయ విద్య కోర్సు ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2019 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి ఛైర్మన్ ఎస్. విజయరాజు వీటిని ప్రకటించారు.
ఏపీ ఎడ్సెట్- 2019 ఫలితాలు విడుదల
సబ్జెక్టుల వారీగా ప్రథమర్యాంకు సాధించిన విద్యార్థులు
1. పి. పల్లవి - గణితం (విజయనగరం)
2. సాయి చంద్రిక- భౌతిక శాస్త్రం(విశాఖ జిల్లా)
3. మణితేజ- జీవశాస్త్రం(తూ.గో.)
4. నాగ సుజాత- సాంఘిక శాస్త్రం(గుంటూరు జిల్లా)
6. హరికుమార్- ఆంగ్లం(అనంతపురం)
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...ఏపీ ఎడ్సెట్- 2019 ఫలితాలు
Last Updated : May 17, 2019, 12:58 PM IST