ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP ECET: ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదల.. - 2022 ఏపీ ఈసెట్‌ ఫలితాలు

AP ECET: ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు వెల్లడించారు.

AP ECET
ఏపీ ఈసెట్‌

By

Published : Aug 10, 2022, 2:47 PM IST

AP ECET: ఏపీ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. ఈసెట్ లో 92.36శాతం ఉత్తీర్ణత నమోదైందని ఆయన తెలిపారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం పూర్తి చేసిన వారికి బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి జెఎన్​టీయూ ఆధ్వర్యంలో జులై 22న ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 14 విభాగాల్లో జరగాల్సిన పరీక్షను.. 11 విభాగాల్లో మాత్రమే నిర్వహించినట్టు చైర్మన్ తెలిపారు.

ఏపీ ఈసెట్‌

ఇందుకు గల కారణాన్ని కూడా తెలియజేశారు. కొన్ని కోర్సుల్లో.. అందుబాటులో ఉన్న సీట్లకంటే దరఖాస్తులు తక్కువగా వచ్చాయని, ఆ కారణంగానే పరీక్ష నిర్వహించలేదని తెలిపారు. సిరామిక్ ఇంజినీరింగ్, బీఎస్సీ గణితం విభాగాలకు తక్కువ దరఖాస్తులు రాగా.. బయోటెక్ కు ఎవ్వరూ దరఖాస్తు చేయలేదని వెల్లడించారు. బీఎస్సీ గణితం, సిరామిక్ టెక్నాలజీకి దరఖాస్తు చేసుకున్న వారంతా ఈసెట్ లో ఉత్తీర్ణత సాధించినట్లేనన్నారు. బీఎస్సీ గణితం డిగ్రీ ఫలితాలు వెలువడిన తర్వాతే ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details