ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజలకు వివరిస్తాం' - ప్రజాచైతన్య యాత్ర తాజా

వైకాపా ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో పింఛన్లు, రేషన్ కార్డుల తొలగించి... అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థ పాలన గురించి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే రేపు ప్రకాశం జిల్లా నుంచి తెదేపా ప్రజా చైతన్య యాత్ర చేపడుతున్నట్లు ఉమా తెలిపారు.

praja chaitanya yathra
'ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజలకు వివరిస్తాం'

By

Published : Feb 18, 2020, 5:01 PM IST

మాట్లాడుతున్న దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగట్టే ఉద్దేశంతోనే ప్రజాచైతన్య యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ప్రకాశం జిల్లాలో అధినేత నారా చంద్రబాబు నాయుడు యాత్రను ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. 45 రోజుల పాటు సాగే యాత్రలో 13 జిల్లాల్లో పర్యటించి... పింఛన్లు, రేషన్ కార్డులు కోల్పోయిన బాధితుల కుటుంబాలను పరామర్శించనున్నట్లు ఉమా తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని... ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజలకు వివరించి వారిలో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు మాజీ మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చూడండి-'ప్రభుత్వ తీరుకు నిరసనగానే ప్రజా చైతన్య యాత్ర'

ABOUT THE AUTHOR

...view details