ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు రొమేనియా, హంగరీలకు ఏపీ ప్రతినిధులను పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రతినిధుల బృందానికి సీఎం జగన్ అంగీకారం తెలిపారు. 680 మంది విద్యార్థుల వివరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విదేశాంగశాఖకు అందించింది.
భారత్‌లోని ఉక్రెయిన్ ఎంబసీ నుంచి ఏపీ విద్యార్థుల వివరాలు సేకరిస్తోంది. ఐబీ స్టాంపింగ్ కార్యాలయం నుంచి వివరాల ఆధారంగా విద్యార్థుల వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ అధికారులు, తహశీల్దార్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు.