ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రాల సీఎస్​లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సు - ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో.. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పురోగతిపై సమీక్షించారు. కడప - బెంగళూరు బ్రాడ్​గేజ్ రైల్వే నిర్మాణ పనులపై ప్రధాని ఆరా తీయగా.. ఏపీ, కర్ణాటక సీఎస్​లు వివరాలు తెలియజేశారు.

pm video conference with states cs
రాష్ట్రాల సీఎస్​లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సు

By

Published : Jan 27, 2021, 5:33 PM IST

దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల పురోగతిపై.. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కడప- బెంగళూరు మధ్య 268 కిలోమీటర్ల పొడవున చేపట్టిన.. బ్రాడ్ గేజ్ రైల్వే నిర్మాణ పనులపై ప్రధాని ఆరా తీశారు. దీనిపై ఏపీ, కర్ణాటక సీఎస్​లు వివరాలను తెలియజేశారు.

ప్రధాన మంత్రి జనఔషధి పరియోజన పథకంపైనా మోదీ సమీక్షించారు. ఈ కేంద్రాల ఏర్పాటుకు ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పౌర ఆస్పత్రుల్లో.. అద్దె లేని స్థలాలను కేటాయించాల్సిందిగా ఆదేశించారు. ఏపీ నుంచి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సహా.. సాధారణ పరిపాలనశాఖ, వైద్యారోగ్యశాఖ, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శులు అనిల్ కుమార్ సింఘాల్, ఎంటీ కృష్ణబాబు, శశిభూషణ్ కుమార్​లు ఈ సదస్సుకు హాజరయ్యారు.

ఇదీ చదవండి:సీఎంగా ఉండటానికి జగన్​రెడ్డి అనర్హుడు: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details