ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 2,410 కరోనా కేసులు.. 11 మంది మృతి - ఏపీలో ఈరోజు కరోనా కేసులు

కరోనా ఉద్ధృతి రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 2,410 కొత్త కేసులు నమోదు కాగా.. 2,452 మంది కోలుకున్నారు. 11 మంది మృత్యువాత పడ్డారు. మరో 21,825 మంది చికిత్స పొందుతున్నారు.

ap covid bulleting on 06.11.20
ఆంధ్రప్రదేశ్ కొవిడ్ బులెటిన్

By

Published : Nov 6, 2020, 7:44 PM IST

రాష్ట్రంలో గత 24 గంటల్లో 79,601 శాంపిళ్లను పరీక్షించగా.. 2,410 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,452 మంది కోలుకుని ఇంటికి వెళ్లగా.. వివిధ జిల్లాల్లో 11 మంది మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 401, కర్నూలులో అత్యల్పంగా 23 మందికి కరోనా నిర్ధారణ జరిగింది.

ఆంధ్రప్రదేశ్ కొవిడ్ బులెటిన్

జిల్లాల వారీగా...

గుంటూరు జిల్లాలో 323, కృష్ణా పశ్చిమ గోదావరిలో 298 చొప్పున, చిత్తూరులో 253 మంది గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడ్డారు. అనంతపురంలో 161, విశాఖపట్టణంలో 142, కడపలో 132, నెల్లూరులో 121, ప్రకాశంలో 108, విజయనగరంలో 79, శ్రీకాకుళంలో 71 చొప్పున కొత్త కేసులు బయటపడ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా...

ఈ కొత్త గణాంకాలతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 8,38,363కి చేరాయి. 6,768 మంది మహమ్మారి ధాటికి బలయ్యారు. 8,09,770 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. మరో 21,825 మంది చికిత్స పొందుతున్నారు. 85,07,230 మందికి చేసిన నిర్ధారణ పరీక్షల్లో.. ఇప్పటివరకు 8,38,363 మంది వైరస్ బారిన పడినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:

పాఠశాలలో కరోనా మహమ్మారి.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు వైరస్​...

ABOUT THE AUTHOR

...view details