AP CORONA CASES: రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో 41,954 మందికి పరీక్షలు నిర్వహించగా.. 3,205 మంది వైరస్ బారిన పడ్డారు. 281 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ఠ్రంలో 10,119 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా.. విశాఖ జిల్లాలో 695 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. చిత్తూరులో 607, తూర్పుగోదావరిలో 274, గుంటూరు జిల్లాల్లో 224 మంది వైరస్ బారిన పడ్డారు. శ్రీకాకుళంలో 268 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో భారీగా నమోదైన కరోనా కేసులు
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 1,94,720 మంది వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ కారణంగా మరో 442 మంది మరణించారు. 60,405 మంది వైరస్‌ను జయించారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 3,60,70,510
- మొత్తం మరణాలు: 4,84,655
- యాక్టివ్ కేసులు: 9,55,319
- మొత్తం కోలుకున్నవారు: 3,46,30,536
Omicron Cases In India
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 85,26,240 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,53,80,08,200కు చేరింది.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే 27,72,068 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 7,847 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసులు 31,41,01,581.. మరణాలు 55,21,038కి చేరాయి.
- అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం మరో 6,72,872మందికి వైరస్ సోకింది. 2,173 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 6.33 కోట్లకు చేరింది.
- ఫ్రాన్స్‌లో కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 3, 68,149 కేసులు నమోదయ్యాయి. మరో 341 మంది మరణించారు.
- బ్రిటన్‌లో మరో 1,20,821 మందికి వైరస్ సోకింది. 379 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో 2,20,532 కొత్త కేసులు బయటపడగా.. 294 మంది మరణించారు.
- స్పెయిన్‌లో 1,34,942 మందికి కొత్తగా వైరస్ సోకింది. మరో 247 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:Rain Alert: రాష్ట్రానికి మళ్లీ వర్ష సూచన..!