రాష్ట్రంలో కొవిడ్ కేసులు 6 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,702 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి కరోనా బాధితుల సంఖ్య 6,01,462కి చేరింది. కరోనా బారిన పడి కొత్తగా 72 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 5,177 మంది మృతి చెందారని వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. ప్రస్తుతం 88,197 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. కరోనా నుంచి 5,08,088 మంది బాధితులు కోలుకున్నారని స్పష్టం చేసింది. 24 గంటల వ్యవధిలో 77,492 కరోనా పరీక్షలు నిర్వహించగా... మొత్తం 48,84,371 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
జిల్లాల వారీగా కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,383 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 1,064, చిత్తూరు జిల్లాలో 905 కరోనా కేసులు నమోదవ్వగా, ప్రకాశం జిల్లాలో 705, నెల్లూరు జిల్లాలో 610 కొవిడ్ కేసులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో 567, గుంటూరు జిల్లాలో 550, అనంతపురం జిల్లాలో 545, విజయనగరం జిల్లాలో 526, విశాఖ జిల్లాలో 449, కర్నూలు జిల్లాలో 394, కృష్ణా జిల్లాలో 367 కరోనా కేసులు నమోదయ్యాయి.