CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 429 కరోనా కేసులు.. 4 మరణాలు - corona
17:13 October 04
VJA_Corona bulletin_Breaking
రాష్ట్రంలో 24 గంటల్లో 30,515 మందికి కరోనా పరీక్షలు చేయగా 429 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కొవిడ్‌తో మరో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1,029 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,753 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
కరోనాతో గుంటూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొకరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో 89, నెల్లూరు జిల్లాలో 85 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:దిగొస్తున్న కరోనా కేసులు- కొత్తగా 20వేల మందికి పాజిటివ్