ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 11, 2020, 5:34 PM IST

Updated : Oct 11, 2020, 9:57 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 5,210 కరోనా కేసులు నమోదు

కొవిడ్ కేసులు
కొవిడ్ కేసులు

17:32 October 11

వైరస్​కు మరో 30 మంది మృతి

రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 5,210 మందికి కరోనా సోకినట్టుగా వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 30 మంది కరోనా కారణంగా మృతి చెందినట్టు వెల్లడించింది. ఇక రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 11.50గా నమోదైనట్టు తెలిపింది. రికవరీ రేటు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు క్రమేపి తగ్గుతుండగా..కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతుందని వైద్య అధికారులు తాజా హెల్త్ బులిటెన్ లో తెలిపారు . గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 5,210 మందికి కరోనా సోకినట్టుగా వైద్యారోగ్యశాఖ తెలిపింది . అత్యధికంగా పశ్చిమగోదావరిలో 786 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 713, తూర్పుగోదావరి జిల్లాల్లో701 మందికి కరోనా సోకింది. అనంతపురంలో 2311 మందికి, గుంటూరులో 431 మందికి, కడపలో418 మందికి, కృష్ణా జిల్లాలో462 మందికి, కర్నూలు 175, నెల్లూరు 288, ప్రకాశం 362, శ్రీకాకుళం 212 మందికి, విశాఖపట్నం190 మందికి, విజయనగరం161 మందికి సోకినట్టుగా అధికారులు తెలిపారు . దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షల 55వేల727కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 46 వేల 295 గా వైద్యాధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 5వేల509 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 7 లక్షల 03 వేల 208 కి పెరిగింది.  

రాష్ట్రంలో కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 30మంది మృతి చెందారు. కొవిడ్ కారణంగా ప్రకాశంలో ఎనిమిది, చిత్తూరులో నలుగురు , తూర్పుగోదావరి , గుంటూరు , కడప, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతిచెందారు.  శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించినట్లు అధికారులు తెలిపారు . దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృతి చెందిన వారి సంఖ్య 6,224కి చేరుకుంది.

Last Updated : Oct 11, 2020, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details