వైఎస్ తన పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి రైతును రాజును చేయాలని తపించారని... ఆయన ఆలోచనల్లో నుంచి పుట్టిందే రైతులకు ఉచిత విద్యుత్ పథకమని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ తెలిపారు. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్‌పై చేశారని గుర్తుచేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన కానుక అని - ఉచిత విద్యుత్ వల్ల లక్షల మంది రైతులు లబ్దిపొందారని తెలిపారు. వైఎస్ పాలనలో రైతే రాజు అన్న నినాదం ఫరిడవిల్లిందని చెప్పుకొచ్చారు. వైఎస్ ఉచిత విద్యుత్ అమలు చేస్తామన్నప్పుడు ప్రతిపక్షాలు ఆవహేళన చేశాయని... విద్యుత్ వైర్లపైన బట్టలు ఆరేసుకోవాలని వ్యంగంగా మాట్లాడారని పద్మశ్రీ గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి వారి విమర్శలకు వైఎస్ గట్టిగా సమాధానం చెప్పారన్నారు. వైఎస్ మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశాయని తెలిపారు. ప్రధాని మోదీ రైతులకు వెన్నుపోటు పొడిచి ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ మీటర్లు పెట్టి రైతులు ఖాతాలకు డబ్బులు జమ చేస్తే వాటిని డిస్కంలకు డ్రా చేసుకుంటాయని చెపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కేసులకు తలవంచి కేంద్రం అడమనట్లు అడుతున్నారని ధ్వజమెత్తారు.
వారి మోసం బయటపడింది...