ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

cm jagan review on projects: రాష్ట్రంలోని ప్రాజెక్టుల భద్రతను పరిశీలించండి : సీఎం జగన్​ - ఏపీ వార్తలు

cm jagan review on projects: రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలన చేయాలని ఆధికారులను ముఖ్యమంత్రి జగన్​ ఆదేశించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, వాటి నిర్వహణపై సీఎంవో కార్యాలయ అధికారులతో జగన్​ సమీక్షించారు.

cm jagan review on water projects
ముఖ్యమంత్రి జగన్

By

Published : Dec 9, 2021, 4:43 PM IST

cm jagan review on projects: రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సీఎంవో కార్యాలయ అధికారులతో ముఖ్యమంత్రి జగన్​ సమీక్షించారు. రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి.. నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలన చేయాలన్నారు.

ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణ లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు. ముప్పు పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణకు సిబ్బందిపై ఆరా తీసిన సీఎం.. అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆదేశాలు జారీచేశారు. సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని అధికారులు వివరించగా.. నియామకానికి చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details