ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ సీఐడీ, నల్సార్ లా యూనివర్సిటీల మధ్య ఒప్పందం - నల్సార్ యూనివర్సిటీతో ఒప్పందం న్యూస్

ఏపీ సీఐడీ విభాగం, నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ లా యూనివర్సిటీ ల మధ్య ఒప్పందం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్, నల్సార్ యూనివర్సిటీ వీసీ ఫైజాన్ ముస్తఫా రిజిస్ర్టార్ వి.బాలకృష్ణా రెడ్డి పాల్గొన్నారు .

ap cid and nalsar law university mou
ap cid and nalsar law university mou

By

Published : Sep 4, 2020, 12:31 AM IST

ఏపీ పోలీసు శాఖకు, నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులకు పరస్పర లాభం చేకూరేలా ఒప్పందం జరిగిందని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. చట్టంలోని వివిధ ప్రొసిజర్లు, కోర్టుల్లో ప్రత్యేక కేసులు , పూర్వపు జడ్జిమెంట్లు అనలైజింగ్, వివిధ కేసుల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ , చట్టాల అమలు పనితీరు గురించి సీఐడీ పోలీసులకు నల్సార్ వర్శిటీ ప్రతినిధులు అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులకు అనుభవంతో కూడిన విజ్ఞానం, సమాజంలో జరుగుతున్న ఎకనామిక్ , ఫైనాన్స్ ఫ్రాడ్స్, మహిళల పట్ల జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలు, సంచలనాత్మకమైన సంఘటనలు గురించి పోలీసులు అవగాహన కల్పిస్తారని డీజీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details