ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఎంపీ రఘురామ వ్యాఖ్యలు' - ఎంపీ రఘురామపై ఏపీ క్రిస్టియన్ జేఏసీ కామెంట్స్

మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు ఉన్నాయని ఏపీ క్రిస్టియన్ జేఏసీ సభ్యులు మేదర సురేశ్ అన్నారు. ఇప్పటికైనా ఆయన భాష మార్చుకొని కుల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకోవాలన్నారు.

AP Christian JAC member on mp raghurama comments
'కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఎంపీ రఘురామ వ్యాఖ్యలు'

By

Published : May 18, 2021, 2:59 PM IST

ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని ఏపీ క్రిస్టియన్ జేఏసీ సభ్యులు మేదర సురేశ్ అన్నారు. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా ఒక మతం పట్ల రఘురామ వ్యాఖ్యలు చేయటం ఆయన స్థాయికి తగదన్నారు.

నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికొదిలేసి సొంత పార్టీపైనే రఘురామ విమర్శలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆయన భాష మార్చుకొని కుల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details