ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో 439కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు - ఏపీలో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 439కు చేరింది. ఈ వైరస్ సోకి ఇప్పటికే ఏడుగురు మృతి చెందారు.

AP Carona Cases
రాష్ట్రంలో 439కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

By

Published : Apr 14, 2020, 11:07 AM IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 439కు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో ఏడుగురు మృతి చెందగా..12 మంది డిశ్చార్జి అయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో 420 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం 8 వేల 755 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు చేయగా... అందులో 8 వేల 316 మంది నమూనాలు నెగటివ్​గా వచ్చాయి.

ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో 93, కర్నూలు జిల్లాలో 84, నెల్లూరు జిల్లాలో 56, ప్రకాశం జిల్లాలో 41, కృష్ణా జిల్లాలో 36, కడప జిల్లాలో 31, చిత్తూరు జిల్లాలో 23, పశ్చిమ గోదావరి జిల్లాలో 23, విశాఖ జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details