రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాతే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని అధికార వైకాపా వర్గాల సమాచారం. ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేసి, అదే రోజు నుంచి నూతన పాలనను ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఇటీవల స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలతోపాటు కొత్త మంత్రులు కూడా ఉగాదికే వస్తారన్న ప్రచారం సాగింది. ఈనెల 18 లేదా 22న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృత ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదని, మే నెల వరకు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉండబోదని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 8తో ప్రస్తుత మంత్రివర్గం ఏర్పాటై మూడేళ్లు పూర్తవుతుంది. అందువల్ల జూన్‌లో పునర్‌వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. జులై 8న వైకాపా ప్లీనరీని నిర్వహించనున్నారు. ప్లీనరీ నుంచి పూర్తిగా రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసే వ్యూహంలో అధికార పార్టీ ఉన్నట్లు సమాచారం. నూతన మంత్రుల రాకకు ముందుగా... ఇప్పటివరకు మిగిలిపోయిన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
జూన్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ?
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాతే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని అధికార వైకాపా వర్గాల సమాచారం. ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేసి, అదే రోజు నుంచి నూతన పాలనను ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఇటీవల స్పష్టంచేశారు.
జూన్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ?