ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లో జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా (AP Cabinet Meeting Postponed) పడింది. రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం (CS Office) అత్యవసర నోట్‌ను జారీ చేసింది. కేబినెట్ సమావేశం నిర్వహించే తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులకు, అన్ని శాఖల కార్యదర్శులకు నోట్‌ను సర్క్యులేట్ చేశారు.
ఈనెల 18న శాసనసభ సమావేశాలు (Assembly Session) ఉన్న నేపథ్యంలో అదేరోజు ఉదయం కేబినెట్ భేటీ అయి..తదుపరి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.