ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cabinet Meeting: ఈనెల 3న జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా - Cabinet Meeting Postpone to 7th march

AP Cabinet Meeting News: ఈనెల 3న జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశం.. 7వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు సీఎస్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. సంబంధించిన మార్పులను గమనించాలని అన్ని ప్రభుత్వశాఖలకు సూచించింది.

రాష్ట్ర కేబినెట్ సమావేశం వాయిదా
ap Cabinet Meeting Postpone

By

Published : Mar 1, 2022, 7:45 PM IST

AP NEWS: ఈనెల 3న జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాన్ని 7న నిర్వహించనున్నట్టు సీఎస్ కార్యాలయం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. మార్చి 7న మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్​లో కేబినెట్ సమావేశం జరుగుతుందని స్పష్టం చేసింది. కేబినెట్ సమావేశాలకు సంబంధించిన మార్పులను గమనించాలని అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు సూచించింది.

దివంగత మంత్రి గౌతమ్ రెడ్డికి సంబంధించి వైదిక కార్యక్రమాల దృష్ట్యా కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మార్చి 7 నుంచి శాసనసభ సమావేశాలు నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అనంతరం.. మద్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details