అక్టోబర్ 1 న రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మెుదటి బ్లాక్లో భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో...పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. అజెండా, అంశాలు, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్ని విభాగాల అధిపతులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 29 మధ్యాహ్నం 3 గంటలలోపు వీటిని జీఏడీకి పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నెల 25 న మంత్రి వర్గ సమావేశం జరగాల్సి ఉన్నా... ముఖ్యమంత్రి తిరుమల పర్యటన కారణంతో దాన్ని వాయిదా వేశారు.
అక్టోబరు 1న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తాజా వార్తలు
రాష్ట్ర మంత్రివర్గం అక్టోబరు 1న సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.

అక్టోబరు 1న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
Last Updated : Sep 27, 2020, 4:48 PM IST