ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు మంత్రి వర్గ సమావేశం...కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ !

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కమిటీని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇసుక సరఫరా మరింత పెంచే అంశంపై ఏపీ శాండ్ కార్పొరేషన్ ఏర్పాటుపై కూడా మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనుంది. నేడు సమావేశం కానున్న మంత్రివర్గం మొత్తం 20 అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

నేడు మంత్రి వర్గ సమావేశం
నేడు మంత్రి వర్గ సమావేశం

By

Published : Jul 15, 2020, 4:41 AM IST

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ముందడుగు పడే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 20 అంశాలతో కూడిన అజెండాలో కొత్త జిల్లాల ఏర్పాటుపైనే కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

జిల్లాల ఏర్పాటుకు కమిటీ !

జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో దీనిపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించనున్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఓ జిల్లా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ మొత్తం వ్యవహరంపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై నేడు జరగే మంత్రివర్గ సమావేశంలో కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఇసుక సరఫరాకు ప్రత్యేక కార్పోరేషన్

రాష్ట్రంలో ఇసుక కొరత తీర్చేందుకు మరిన్ని చర్యలతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేలే ప్రభుత్వం మరో కీలకన నిర్ణయం తీసుకోనుంది. ఇసుక అక్రమాలను నియంత్రించేందుకు ఇప్పటికే స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా ఇసుక లభ్యతను మరింత పెంచేలా.. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇసుక సరఫరా కోసం ప్రత్యేకంగా శాండ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఏపీఎండీసీకి అనుబంధంగా శాండ్‌ కార్పొరేషన్‌ ఉండేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అలాగే పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టుల ఏర్పాటుకు కెబినెట్‌ ఆమోద ముద్ర వేయనుంది.

రాజధాని తరలింపుపై చర్చ

మూడు రాజధానుల ఏర్పాటు.. రాజధాని తరలింపు అంశంతోపాటు కొత్తగా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాల పైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఈ క్రమంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కావాల్సిన నిధుల లభ్యత పైనా చర్చ జరిగే అవకాశం కన్పిస్తోంది. రాజకీయ పరంగా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు.. కెబినెట్‌లో కొత్త మంత్రులు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇదీచదవండి

'కరోనా బాధితులకు వైద్యం నిరాకరిస్తే.... ఆస్పత్రి అనుమతి రద్దు'

ABOUT THE AUTHOR

...view details