Ayush On Omicron Medicine:ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందు ఇస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని ఆయుష్‌శాఖ స్పష్టం చేసింది. ఒమిక్రాన్‌కు ఆయుష్‌శాఖ ఎలాంటి మందునూ అనుమతించలేదని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆయుర్వేద మందు సరఫరాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. గుర్తింపులేని మందును ఆయుర్వేద వైద్యంగా భావించవద్దని ప్రజలకు సూచించారు. వైద్యుల సలహాతోనే ఆయుర్వేద, హోమియో మందులు వాడాలన్నారు.
రాష్ట్రంలో 4కు చేరిన ఒమిక్రాన్ కేసులు..
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నాలుగుకు చేరాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సదరు మహిళ ఈనెల 19న కువైట్ నుంచి విజయవాడకు చేరుకుంది. అక్కడినుంచి స్వస్థలం అయినవిల్లి మండలం నేదునూరు వెళ్లింది. ఆమె నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా అదనపు డీఎంహెచ్‌వో వెల్లడించారు. మహిళ భర్త, పిల్లలకు కరోనా నెగెటివ్ వచ్చిందని.. మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.