ap assembly: కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం(ap assembly resolution on caste wise bc census) కోరింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శాసనసభలో మంగళవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సభా ఆమోదించింది. ఈ సందర్భంగా.. బీసీలంటే ‘బ్యాక్ వర్డు క్లాస్’ కాదు, ‘బ్యాక్ బోన్ క్లాస్’గా మారుస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ‘దేశంలో కులాలు ఉన్నాయన్న వాస్తవాన్ని అందరం అంగీకరిస్తున్నాం. జనగణనలో మాత్రం రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు బీసీ జనాభా లెక్కలు సేకరించలేదు. విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఎంత వెనుకబాటు ఉందో తేలిస్తే ఎంత మేరకు చర్యలు తీసుకోవాలన్న స్పష్టత ప్రభుత్వాలకు వస్తుంది. సమాజంలో కులాల పరంగా తమకు మరింత న్యాయం చేయాలనే డిమాండ్లు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో జనాభా గణనకు ప్రత్యేక విధానం అంటూ ఏదీ లేదు, ఉండదు. కాబట్టి ఈసారి జనాభా లెక్కల్లో కులాల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్‌కు శాసనసభ తరఫున మద్దతు తెలుపుతూ తీర్మానం చేస్తున్నాం’ అని సీఎం(cm jagan on resolution on caste wise bc census) ప్రకటించారు.
- బ్రిటిష్ హయాంలో 1931లో బీసీల కులాల వారీ జనగణన(resolution on caste wise bc census in ap) జరిగింది. ఈ సారి జనగణన సందర్భంగా ప్రతి ఒక్కరినీ వారి కులం ఏమిటో కేంద్ర ప్రభుత్వమే అడిగేలా ఒక కాలమ్ పెట్టి డేటా సేకరించాలని వచ్చిన డిమాండ్లను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆగస్టులో తిరస్కరించింది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఈ డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సైతం ఈ డిమాండ్‌పై తీర్మానం చేస్తోంది.
- ఏలూరులో పార్టీ తరఫున నిర్వహించిన బీసీ డిక్లరేషన్‌లో బీసీలంటే ‘బ్యాక్ వర్డు క్లాస్’ కాదు, ‘బ్యాక్ బోన్ క్లాస్’గా మారుస్తామని చెప్పాం. అందుకు చర్యలు తీసుకున్నాం. వైకాపా అధికారంలోకి వచ్చాక గెలిచిన, గెలవబోతున్న ఎమ్మెల్సీలు 32 మంది. వీటిలో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. నలుగురిని రాజ్యసభకు పంపాం. అందులో ఇద్దరు బీసీలే. శాసనసభ స్పీకర్ పదవి కూడా బీసీలకు ఇచ్చాం. మండలి ఛైర్మన్‌గా తొలిసారి దళితులకు అవకాశం ఇచ్చాం. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 635 మండల పరిషత్తుల్లో 67 శాతం, 13 జిల్లా పరిషత్తు ఛైర్మన్ పదవుల్లో 69శాతం, 13 నగరపాలక సంస్థల మేయర్ల పదవుల్లో 92 శాతం ఇచ్చాం. గెలుచుకున్న 84 మున్సిపాలిటీల్లో 73 శాతం ఇచ్చాం. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవుల్లో 60 శాతం ఇచ్చాం. 56 ప్రత్యేక కార్పొరేషన్లు బీసీల కోసం ఏర్పాటు చేశాం.
- తెదేపా పాలనలో బీసీలనూ విభజించారు. ఓటు వేసిన వారు, వేయని వారంటూ విభజించి పథకాలు అమలు చేశారు.
సరైన గణాంకాలు అవసరం: