మోటారు పెనాల్టీల జీవో 21పై ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు విజయవాడలో మండిపడ్డారు. లారీ, ఆటో, ట్రక్కు, క్యాబ్ తదితర మోటారు రవాణా రంగ కార్మికులపై భారీగా పెనాల్టీలు పెంచుతూ జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని ధర్నాకు దిగారు. ఇది సినిమా కాదు... జీవితం అన్నారు.
జీవోతో ఆటో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని.. కార్మిక సంఘం నాయకులు పొలారి అన్నారు. వైకాపా ఎన్నికల హామీలను అమలు చేయడానికి సామాన్య ప్రజల ధరలను విపరీతంగా పెంచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తక్షణమే జీవో నెంబర్ 21 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.