ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

College Students Protest : ఎఎన్ఆర్, డిఏఆర్ కళాశాల విద్యార్థుల నిరసన...అడ్డుకున్న పోలీసులు - నూజివీడులో ఎస్ఎఫ్ఐ ర్యాలీ

ANR Students Protest: కృష్ణాజిల్లా గుడివాడ ఏఎన్నార్ కళాశాలను ఎయిడెడ్ గా కొనసాగించాలంటూ, గుడివాడ - విజయవాడ రహదారిపై విద్యార్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నూజివీడు డీఏఆర్ కళాశాలను (DAR Aided College)ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

College Students Protest
ఎఎన్ఆర్, డిఏఆర్ కళాశాల విద్యార్థుల నిరసన

By

Published : Nov 23, 2021, 10:32 AM IST

ANR Students Protest: కృష్ణాజిల్లా గుడివాడ ఏఎన్నార్ కళాశాలను ఎయిడెడ్ గా కొనసాగించాలంటూ, గుడివాడ - విజయవాడ రహదారిపై విద్యార్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డుపై ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులను గుడివాడ వన్​టౌన్​ పోలీసులు అడ్డుకొని, తరగతి గదులకు పంపించివేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు.

ఇదీ చదవండి : Electric bike burnt : ప్రయాణంలో ఉండగా ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం

నూజివీడులో డీఏఆర్ కళాశాల విద్యార్థుల ర్యాలీ...

DAR Aided College: నూజివీడు డీఏఆర్ కళాశాలను ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ర్యాలీ నిర్వహించింది. ఎంతో మంది దాతల సహకారంతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న డీఏఆర్ కాలేజీ విద్యార్థులే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు లెనిన్, నూజివీడు ఎస్ఎఫ్ఐ టౌన్ కార్యదర్శి అశోక్ ,ధర్మ అప్పారావు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : NTR Trust Help : టెన్త్​ విద్యార్థినులకు నారా భువనేశ్వరి సాయం

ABOUT THE AUTHOR

...view details