ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాల్​మనీ వేధింపులకు మరో వ్యక్తి  బలి..! - Another victim of Call Money harassment

విజయవాడలో దారుణం జరిగింది. కాల్​మనీ భూతానికి మరో నిండు ప్రాణం బలి అయ్యింది. కాల్​మనీ వేధింపులు తట్టుకోలేక ప్రేమ్​కుమార్ అనే వ్యక్తి బకింగ్ హామ్ కెనాల్​లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

another-victim-of-call-money-harassment
కాల్​మనీ వేధింపులకు మరో వ్యక్తి  బలి

By

Published : Dec 30, 2019, 12:48 PM IST

విజయవాడకు చెందిన ప్రేమ్ కుమార్ అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో తాడేపల్లిలోని బకింగ్ హామ్ కెనాల్​లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని... అతని భార్య దిశితకృష్ణ పటమట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ప్రేమ్ కుమార్ నాలుగు నెలల క్రితం ఓ వడ్డీ వ్యాపారి వద్ద కాల్​మనీ కింద 4 లక్షలు తీసుకున్నాడు. వడ్డీతో కలిపి 16లక్షలు చెల్లించినా... ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నాడు. ఆ బాధ భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రేమ్ వీడియో తీసి పంపించాడని... కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. తనకు బతకాలని ఉన్నా ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నానని... పిల్లల్ని బాగా పెంచాలని ఉందని తన సెల్ఫీ వీడియోలో ప్రేమ్ దీనంగా చెప్పాడు. బకింగ్ హామ్ కెనాల్ వద్ద ప్రేమ్ కుమార్ ద్విచక్ర వాహనం లభ్యం కావడంతో... పోలీసులు మృతదేహం కోసం గాలించారు. మృతదేహం లభ్యం కాలేదు.

కాల్​మనీ వేధింపులకు మరో వ్యక్తి బలి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details