తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి కొండలరావు తెలిపారు. రెండు రోజుల క్రితం పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం ఫలితం వచ్చింది. మిర్యాలగూడలోని తన ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నారు. మిర్యాలగూడలో అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు కరోనా సోకడం వల్ల ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన మరో ఎమ్మెల్యే - కొవిడ్ బారిన పడిన మిర్యాలగూడ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి కొండలరావు తెలిపారు. ప్రస్తుతం భాస్కరరావు మిర్యాలగూడలోని తన ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నారు.

another-mla-tested-corona-positive-in-telangana