బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈనెల 19 నాటికి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఈనెల 19 నాటికి మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీలో వర్షాలు
ఈనెల 19నాటికి మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
![ఈనెల 19 నాటికి మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9198223-416-9198223-1602847048020.jpg)
మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
Last Updated : Oct 16, 2020, 5:23 PM IST