ఈ నెల 14న ఆయుర్వేద వైద్యుని ఇంట్లో జరిగిన చోరీ కేసులో ప్రకాష్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 8.5 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిందితులు 48.5 లక్షల రూపాయల నగదు, కొంత బంగారం దోచుకున్నారు.
ఇప్పటివరకు పోలీసులు 43 లక్షల 25 వేల రూపాయల నగదు, 48 గ్రాముల బంగారు ఆభరణాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రకాష్‌కు గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మంగళగిరి టౌన్, రూరల్, తాడేపల్లిలో మొత్తం 3 గొలుసు దొంగతనాల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు ప్రకాష్‌ను కోర్టులో హాజరుపరిచారు.