రాష్ట్రానికి మరో 3.24 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం సంస్థ నుంచి టీకా డోసులు విజయవాడకు తరలించారు. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించిన అధికారులు.. ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జిల్లాలకు వాటిని పంపిణీ చేయనున్నారు. కొరత ఉన్న వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలకు టీకాలను తరలిస్తామని అధికారులు తెలిపారు.
రాష్ట్రానికి మరో 3.24 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు - ఆంధ్రాకి వచ్చిన వ్యాక్సిన్లు
పుణెలోని సీరం సంస్థ నుంచి టీకా డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. 3.24 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులను గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.
![రాష్ట్రానికి మరో 3.24 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు covid shield vaccine](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12283211-875-12283211-1624813054594.jpg)
కొవిషీల్డ్ టీకా డోసులు