ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP: నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు తెదేపా కమిటీలు - తెదేపా నియోజకవర్గ కమిటీలు

నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు తెదేపా కమిటీలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. మొత్తంగా నాలుగు పార్లమెంట్ స్థానాలకు కలిపి 133 మంది సభ్యులను నియమించగా..అందులో 86 మంది బీసీలకు చోటు కల్పించారు.

TDP Committees for four Parliamentary constituencies
నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు తెదేపా కమిటీలు ప్రకటన

By

Published : Jun 12, 2021, 8:37 PM IST

నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు తెదేపా కమిటీలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, అరకు, ఏలూరు పార్లమెంట్ స్థానాలకు కమిటీ సభ్యుల వివరాలను ఆ పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఒక్కో పార్లమెంట్ స్థానానికి 30 మందికి పైగా సభ్యులను నియమించారు.

  • శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి కూన రవికుమార్ అధ్యక్షతన మొత్తం 36మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో అత్యధికంగా 32మంది బీసీలకు అవకాశం కల్పించారు. మిగిలిన నలుగురిలో ఇద్దరు ఎస్సీలకు, ఓసీ, ఎస్టీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు.
  • విజయనగరం పార్లమెంట్ స్థానానికి కిమిడి నాగార్జున అధ్యక్షతన మొత్తం 33మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో 23 మంది బీసీలకు చోటు కల్పించారు.
  • గుమ్మడి సంధ్యారాణి అధ్యక్షతన 32 మందితో అరకు పార్లమెంట్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో 18 మంది బీసీలకు, 12 మంది ఎస్టీలకు పదవులు దక్కాయి.
  • గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన 32 మందితో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీని ఖరారు చేశారు. ఇందులో 13 మంది బీసీలు, ఒక మస్లిం మైనార్టీ, ముగ్గురు ఎస్సీలకు, 15మంది ఓసీలకు పదవులు దక్కాయి.
  • మొత్తంగా నాలుగు పార్లమెంట్ స్థానాలకు కలిపి 133 మంది సభ్యులను నియమించగా..అందులో 86 మంది బీసీలకు చోటు కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details