ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇంద్రకీలాద్రిపై అన్నదాన కార్యక్రమం పునః ప్రారంభం

By

Published : Feb 6, 2021, 8:59 AM IST

ఇంద్రకీలాద్రిపై అన్నదాన కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. కరోనా సమయంలో నిలిపేసిన ఈ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహిస్తున్నట్లు ఆలయ పాలకమండలి పేర్కొంది.

Annadana program restart on Indrakeeladri
ఇంద్రకీలాద్రిపై అన్నదాన కార్యక్రమం

విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. మల్లికార్జున స్వామి మహా మండపం రెండో అంతస్తులో నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. అన్నప్రసాదం స్వీకరించేలా ఏర్పాట్లు చేశామని పాలమండలి పేర్కొంది.

ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేశ్​ బాబు ఇతర పాలకమండలి సభ్యులు అన్నప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా సమయంలో దీనిని నిలిపివేశారు. ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి.. అన్నప్రసాదం ప్యాకెట్ల రూపంలో అందిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ మునుపటిలా నిర్వహిస్తామని ఆలయాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:మార్చి నుంచి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి

ABOUT THE AUTHOR

...view details