విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కరోనా కారణంగా రెండు నెలలుగా నిలిపేసిన అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆలయ పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో డి.భ్రమరాంబ వెల్లడించారు. కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందని వారు అన్నారు. దీంతో సాంబారు అన్నం ప్యాకెట్లను అమ్మవారి ప్రసాదంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
దుర్గగుడిలో అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం పునఃప్రారంభం - Durgagudi in vijayawada news
విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాన్ని ప్యాకెట్ల రూపంలో అందించే కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా రెండు నెలలుగా ప్రసాదాల పంపిణీ నిలిచిపోయింది.

అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం