ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Anganwadi's Protest: విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన.. ఉద్రిక్తత - విజయవాడ లెనిన్ సెంటర్‌లో అంగన్వాడీల ఆందోళనలు

Anganwadi's protest: సమస్యలు పరిష్కరించాలంటూ.. అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రిలే నిరహార దీక్షలు ఉద్రిక్తతకు దారి తీశాయి. విజయవాడ లెనిన్ సెంటర్​లో వారు చేపట్టిన నిరసనలకు అనుమతి లేదంటూ.. పోలీసులు దీక్షను భగ్నం చేశారు. అయినా వినకుండా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలుపుతున్న కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Anganwadi's protest in lenin centre at vijayawada
విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన.. అరెస్ట్​

By

Published : Mar 15, 2022, 11:37 AM IST

Updated : Mar 15, 2022, 1:13 PM IST

విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన.. అరెస్ట్​

Anganwadi's protest: అంగన్వాడీల ఆందోళనతో విజయవాడ​లో ఉద్రిక్తత నెలకొండి. సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. విజయవాడ లెనిన్ సెంటర్‌లో ఆందోళనకు దిగిన అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు.

అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు

జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ.. అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ర్యాలీలకు, దీక్షలకు అనుమతి లేదంటూ.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో స్పల్ప తోపులాట జరిగింది. నినాదాలు చేస్తున్న కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

శాంతియుతంగా నిరసన చేస్తే అరెస్టులా.?

హామీలు అమలు చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. అరెస్టు చేయడమేంటని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని... ఎన్ని సార్లు అరెస్టులు చేసినా వెనక్కి తగ్గమని తేల్చిచెప్పారు. కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించేవరకు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు.

ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం

మరోవైపు విజయవాడలోని వేరే ప్రాంతంలో ఆందోళనకు దిగిన అంగన్వాడీలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ర్యాలీలకు అనుమతి లేదంటూ అడ్డుకుని నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

కల్తీసారా విక్రేతలు వైకాపా నాయకులే.. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు

Last Updated : Mar 15, 2022, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details