ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్​గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం నేడే.. - andhrapradesh new governer bishvabhushan harichandan will charg today

ఆంధ్రప్రదేశ్ గవర్నర్​గా బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డితోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మంత్రులు, ప్రముఖుల మధ్య... ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.

గవర్నర్​గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం నేడే..

By

Published : Jul 24, 2019, 3:20 AM IST

Updated : Jul 24, 2019, 4:46 AM IST

ఆంధ్రప్రదేశ్ గవర్నర్​గా బిశ్వభూషణ్ హరిచందన్ చేత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్ కుమార్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కూడా నరసింహనే రెండు రాష్ట్రాలకు గవర్నర్​గా వ్వవహరించారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్​కు తొలి గవర్నర్​గా బిశ్వ భూషణ్​ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన మంగళవారమే రాష్ట్రానికి చేరుకున్నారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్నారు. రాజ్ భవన్​ను సర్వాoగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా గవర్నర్ ముఖ్యులతో సమావేశమయ్యే మందిరాన్ని కలంకారి చిత్ర రూపాలతో అందంగా అలంకరించారు. 11.15 గంటలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాజ్ భవన్​కు చేరుకుంటారు. 11.20కి ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకుని.. గవర్నర్​ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పరిచయం చేస్తారు. 11.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం ఫొటో సెషన్, తేనీటి విందుతో కార్యక్రమం ముగుస్తుంది. గవర్నర్ ప్రమాణ స్వీకారం దృష్ట్యా రాజ్ భవన్ ప్రాంతంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండీ... ఏపీ గవర్నర్​గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌

Last Updated : Jul 24, 2019, 4:46 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details