- సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి: సీఎం జగన్
పీఏసీఎస్(ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల) నెట్‌వర్క్‌ను మరింత పెంచాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రతి మూడు రైతు భరోసా కేంద్రాలకు ఒక పీఏసీఎస్ ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. సహకార వ్యవస్థలు పూర్తి పారదర్శకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పీఏసీఎస్ నివేదికల్లో తేడా వస్తే థర్డ్ పార్టీతో స్వతంత్ర విచారణ జరపాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- పుర పోరు: చిత్తూరు నగరపాలక సంస్థ వైకాపా కైవసం
చిత్తూరు నగరపాలక సంస్థ వైకాపా కైవసం చేసుకుంది. చిత్తూరులోని 50 డివిజన్లలో 37 చోట్ల వైకాపా ఏకగ్రీవమైంది. చిత్తూరులో మిగతా 13 డివిజన్లకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- పలమనేరు పురపాలక సంఘం వద్ద తోపులాట
చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘం వద్ద వైకాపా - తెదేపా నాయకులు ఘర్షణకు దిగారు. పురపాలక సంఘం కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించగా.. తెదేపా నాయకులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- స్వామీజీ.. మా అభ్యర్థిని గెలిపించండి: నారాయణ
జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సంఘటన జరిగింది. సీపీఐ అభ్యర్థి ఆర్.యశోద 97వ వార్డులో ప్రచారం నిర్వహిస్తుండగా... సీపీఐ జాతీయ నేత శారదా పీఠాన్ని సందర్శించారు. ''స్వామీజీ.. మిమ్మల్ని కలిసి గెలిపించాలని కోరిన వారందరినీ గెలిపిస్తారంటగా... మా పార్టీ అభ్యర్థిని కూడా గెలిపించండి'' అని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 'కొవాగ్జిన్ టీకా 81% సమర్థవంతం'
ఐసీఎంఆర్‌తో కలిసి కరోనా నిరోధక టీకాను అందుబాటులోకి తెచ్చిన దేశీయ సంస్థ భారత్ బయోటెక్.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ప్రకటించింది. కొవాగ్జిన్ మధ్యంతర క్లినికల్ సామర్థ్యం 81 శాతమని తెలిపింది. మరింత సమాచారాన్ని సేకరించేందుకు.. కొవాగ్జిన్ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతాయని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- టీకా ధ్రువపత్రంపై మోదీ చిత్రం అధికార దుర్వినియోగమే