ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అహ్మదాబా​ద్​ పర్యటనకు పట్టణ ప్రాంత భూసేకరణ కమిటీ - ఏపీలో భూ సేకరణపై తాజా వార్తలు

పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టే నగర అభివృద్ధి పథకాల అమలు కోసం భూసేకరణపై నియమించిన అధ్యయన కమిటీ అహ్మదాబాద్​లో పర్యటించనుంది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 6 వరకూ అహ్మదాబాద్​లో​ ఈ బృందం పర్యటిస్తుంది.

అహ్మదాబ్​ద్​ పర్యటనకు పట్టణ ప్రాంత భూసేకరణ కమిటీ
అహ్మదాబ్​ద్​ పర్యటనకు పట్టణ ప్రాంత భూసేకరణ కమిటీ

By

Published : Feb 1, 2021, 8:37 PM IST

పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టే నగర అభివృద్ధి పథకాల అమలు కోసం భూసేకరణపై నియమించిన అధ్యయన కమిటీ అహ్మదాబాద్ పర్యటనకు వెళ్లనుంది. ఈ మేరకు ఆ బృందాన్ని పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి వై. శ్రీలక్ష్మి నేతృత్వంలో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 6 వరకూ అహ్మదాబాద్​లో ఈ అధ్యయన బృందం పర్యటించనుంది.

పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శితో పాటు అహ్మదాబాద్ పర్యటనకు కాకినాడ, నెల్లూరు, కర్నూలు, విశాఖ, తిరుపతి, అమరావతి మెట్రోరీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్లు, టౌన్, కంట్రీ ప్లానింగ్ డైరక్టర్, ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. మొత్తం 25 మంది అధికారులతో కూడిన అధ్యయన బృందం అహ్మదాబాద్ ప్రయాణ వ్యయాన్ని భరించాల్సిందిగా.. విశాఖపట్నం మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఆదేశించింది.

ఇదీ చదవండి: ఏకగ్రీవాలపై వైకాపా ఆశలు నీరుగారాయి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details