రెండో దశ పంచాయతీ ఎన్నికలకు 13 జిల్లాల్లోని 167 మండలాల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో భాగంగా మెుత్తం 3,328 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే 539 ఏకగ్రీవాలు పోగా మిగతా 2,786 చోట్ల ఈ నెల 13న ఎన్నికలు నిర్వహిస్తారు. రెండోదశ ఎన్నికల్లో 7,510 మంది సర్పంచి అభ్యర్థుల పోటీలో ఉన్నారు. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో 33,570 వార్డుల్లో 12,605 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాలు పోగా మిగతా 20,796 వార్డుల్లో ఎన్నికలు జరగుతాయి. వార్డుల్లో 44,879 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారని ఎస్ఈసీ తెలిపింది.
- రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏయే జిల్లాలో ఎన్ని ఏకగ్రీవాలయ్యాయంటే..
- గుంటూరు జిల్లాలో 70 పంచాయతీలు ఏకగ్రీవం
- ప్రకాశం జిల్లాలో 69 పంచాయతీలు ఏకగ్రీవం
- చిత్తూరు జిల్లాలో 62 పంచాయతీలు ఏకగ్రీవం
- విజయనగరం జిల్లాలో 60 పంచాయతీలు ఏకగ్రీవం
- కర్నూలు జిల్లాలో 57 పంచాయతీలు ఏకగ్రీవం
- శ్రీకాకుళం జిల్లాలో 41 పంచాయతీలు ఏకగ్రీవం
- కడప జిల్లాలో 40 పంచాయతీలు ఏకగ్రీవం
- కృష్ణా జిల్లాలో 36 పంచాయతీలు ఏకగ్రీవం
- నెల్లూరు జిల్లాలో 35 పంచాయతీలు ఏకగ్రీవం
- విశాఖ జిల్లాలో 22 పంచాయతీలు ఏకగ్రీవం
- తూర్పు గోదావరి జిల్లాలో 17 పంచాయతీలు ఏకగ్రీవం
- పశ్చిమ గోదావరి జిల్లాలో 15 పంచాయతీలు ఏకగ్రీవం
- అనంతపురం జిల్లాలో 15 పంచాయతీలు ఏకగ్రీవం