ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ గుర్తింపు తమ సంఘానికే ఉందని అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నెల 10న అధికారికంగా ఆదేశాలు జారీ చేసి చెప్పిందని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఏకేఎఫ్ఐ అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ ఎస్పీ గార్గ్ జారీ చేసిన ఆర్డర్ కాపీను ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ విడుదల చేశారు.
తప్పుడు పద్ధతిలో కబడ్డీ అసోసియేషన్‌ను యలమంచిలి శ్రీకాంత్ తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. దీనిపై హైకోర్టుకు వెళ్లగా.. ఈనెల 3న ఇరు వర్గాల సమక్షంలో జూమ్ యాప్ ద్వారా విచారణ నిర్వహించారన్నారు. వాదనల అనంతరం అధ్యక్షుడిగా వెంకటరెడ్డి, కార్యదర్శిగా శ్రీకాంత్ ఉన్న అసోసియేషన్‌కు గుర్తింపు లేదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. యలమంచిలి శ్రీకాంత్ ఉద్దేశపూర్వకంగానే తమ సంఘంపై అనేక ఆరోపణలు చేశారని కేఈ ప్రభాకర్ విమర్శించారు. క్రీడాకారులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని సూచించారు.